ఈ వైరస్ కరోనా కన్నా డేంజరస్,

ఈ వైరస్ కరోనా కన్నా డేంజరస్, ప్రపంచ జనాభాలో సగం మంది చనిపోతారు, సైంటిస్ట్ వార్నింగ్




అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్, పౌష్టికాహార డాక్టర్ మైఖేల్ గ్రెగర్ మరో బాంబు పేల్చారు. ‘కరోనా వైరస్’ కన్నా అతి భయంకరమైన వైరస్(బర్డ్ ఫ్లూ లాంటిది) ఒకటి ప్రపంచాన్ని వణికించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచ జనాభాలోని సగం మందిని కోల్పోతామని తెలిపారు. అంటు వ్యాధులను ఎలా నివారించాలి?(How To Survive a Pandemic) అనే కొత్త పుస్తకం
డాక్టర్ మైఖేల్ గ్రెగర్ రాశారు. అందులో శాఖాహారం ప్రయోజనాలను వివరించారు. జంతువుల మాంసం వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని.. ఈ కారణంగా మొత్తం మానవ జాతికి ముప్పు ఉంటుందన్నారు. జంతువుల పెంపకం, వాటి వేట, మాంసాన్ని తినడం మావనాళిని ప్రమాదంలో పడేస్తుందనేది ఆయన వాదన.

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే చాలా వైరస్‌లు ఎటువంటి హాని కలిగించవు. కానీ క్షయ, సార్స్ వంటి కొన్ని రకాల వైరస్‌లు మాత్రం చాలా వేగంగా పెరుగుతాయన్నారు. నిజానికి అవి చాలా ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. కాగా ఆయన రాసిన బుక్‌లో ముఖ్యంగా చికెన్ కారణంగా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.

చికెన్ లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువ:
నేటి పశు వ్యవసాయంలో కోళ్ల పెంపకం పెద్ద భాగమైంది. ఇఫ్పుడు దాదాపు అన్ని దేశాల్లో కోడి గుడ్లు ఎక్కువగానే తింటున్నారు. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కోళ్లను చాలా క్రూరంగా బోనులో ఉంచుతారు. వాటికి రసాయనాలు కలిగిన ఆహారాలు ఇస్తారు. ఈ కారణంగానే చికెన్‌లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అభిప్రాయ పడ్డారు. ఎక్కువ సంఖ్యలో ఎంత క్రూరంగా మనం చికెన్ తయారు చేస్తున్నామో.. వైరస్ వ్యాప్తి కూడా అంతే స్థాయిలో ఎక్కువగా ఉంటుందని బుక్‌లో తెలిపారు. ఇది మహమ్మారిని ఆహ్వానించడం లాంటిదన్నారు డాక్టర్ మైఖేల్.



చరిత్రలో అత్యంత భయంకరమైనది స్పానిష్ బర్డ్ ఫ్లూ:
‘ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా దీన్నే స్పానిష్ బర్డ్ ఫ్లూ’ అని పిలుస్తారు. 1918-1920 మధ్య ప్రపంచ జనాభాలో మూడింట.. ఒక వంతు మందికి సోకింది. మొత్తం 10 శాతం మరణాలు ఈ కారణంగానే జరిగాయి. ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన అంటువ్యాధిగా నమోదు చేయబడి
#trendingnow #news #corona

Comments